-

CM YS Jagan Birthday: తొలి రోజు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

20 Dec, 2022 04:28 IST|Sakshi
విశాఖలో మ్యూజికల్‌ చైర్‌ ఆడుతున్న మహిళలు

పలు జిల్లాల్లో క్రీడా పోటీలు

చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు

మహిళలకు ముగ్గుల పోటీలు

సాక్షి, విశాఖపట్నం/రేణిగుంట/సూళ్లూరు­పేట: ఈ నెల 21న సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడురోజు­లపాటు నిర్వ­హి­­­స్తున్న వేడుకలు ఘనంగా ప్రా­రం­భమ­య్యాయి. ఇందులో భాగంగా తొలి­రోజు సోమ­­వారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. విజే­తలకు బహుమతులు అందజేశారు. అలాగే పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చిరు వ్యా­పా­రు­లకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వ­హింరు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్‌­సీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వ­ర్యంలో నిర్వ­హించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌­బాబు ప్రారంభించారు. అలాగే వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోకో, త్రోబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. విశాఖ దక్షిణ నియో­జ­కవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌­కుమార్‌ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు ప్రారంభించారు.

గాజు­­వాక, భీమిలి నియోజకవర్గాల్లో ఎమ్మె­ల్యేలు తిప్పలనాగి­రెడ్డి, ముత్తం­శెట్టి శ్రీనివాస్‌ క్రికెట్‌ పోటీ­లను నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వ­యకర్త అడారి ఆనంద్‌కుమార్‌ నిర్వ­హి­స్తున్న క్రికెట్‌ టోర్నీని పం­చకర్ల రమేష్‌­బాబు ప్రారంభించారు. అన­కా­పల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ‘నవ­రత్నాలు– సంక్షేమపథకాలు’ పేరిట విద్యా­­­­­­ర్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

విజేతలకు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు చేతుల మీదుగా బహు­మతులు అందించారు. ఎస్‌.రాయ­వరం, నక్క­పల్లి మండ­లాల్లో కబడ్డీ, హాకీ పోటీలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారం­­భించారు. అల్లూరి సీతా­రామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచో­డవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల క్రీడా పోటీలు జరి­గాయి. వీటిని ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కె.భాగ్య­లక్ష్మి, నాగు­లా­పల్లి ధనలక్ష్మి ప్రారంభించారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మధు­రపూడి విమానాశ్ర­యంలో కేక్‌ కట్‌ చేశా­రు. అనపర్తి, గోపాల­పురం నియో­జకవర్గాల్లో ఎమ్మె­ల్యేలు సత్తి సూర్యనారాయణ­రెడ్డి, తలా­రి వెంకట్రావు క్రీడా పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీకాళ­హస్తి ఎమ్మెల్యే  మధుసూదన్‌­రెడ్డి వందమంది చిరు వ్యా­పా­రులకు తోపుడుబండ్లను అందజేశారు. సూళ్లూ­­రు­పేటలో ఎమ్మెల్యే సంజీవ­య్య ఆధ్వర్యంలో మహిళలకు ము­గ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సంద­ర్భ­ంగా మహిళలు ముగ్గులతో సీఎం జగన్‌ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 

నేడు, రేపు పలు కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్ర­మాలను నిర్వ­హించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణ­యిం­చింది. ఇందులో భాగంగా ఈ నెల 20న మొక్కలు నాటే కార్య­క్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో ‘జగనన్న పరిపాలన.. రాష్ట్ర సంక్షేమం–అభివృద్ధి’పై చర్చ ఉంటుంది.

ఇదే రోజు ముం­దస్తు జన్మదిన వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్‌క్రాస్‌ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను పార్టీ నిర్వహించనుంది. అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే మహిళలకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.

పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయను­న్నారు. ఇప్పటికే సీఎం జన్మదిన వేడుకలు సోమవారం ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రారంభమయ్యాయి. గతేడాది సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. ఇది ఎందరినో అత్యవసర సమయాల్లో ఆదుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించనున్నారు.

ఇలా సేకరించిన రక్తాన్ని భద్రపరిచి అవసరమైన రోగులకు అందిస్తారు. అలాగే రక్తదాతల నుంచి ప్లెడ్జ్‌ ఫామ్స్‌ సేకరించి రోగులకు అత్యవసరమైన సందర్భాల్లో రక్తం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకు ‘టేక్‌ ద ప్లెడ్జ్‌.. సేవ్‌ ఏ లైఫ్‌’ అనే నినాదంతో.. రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్నవారిని ysrcpblooddonation.comలో నమోదు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు. డ్వాక్రా, మహిళా, కుల, ప్రజాసంఘాలు, మేధావులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు