7న దేవరపల్లికి రానున్న సీఎం జగన్‌

6 Dec, 2020 07:52 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి (దేవరపల్లి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7న దేవరపల్లికి రానున్న దృష్ట్యా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌  ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్‌ పరిశీలించారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకలకు సీఎం జగన్‌ హాజరవుతున్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను బారికేడ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు.   చదవండి: (మహిళల రక్షణలో 'దిశ' మారదు)


సీఎం పర్యటన రేపు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ 
అనంతరం పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్‌ వేదిక, వీవీఎస్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వీఐపీల వాహనాల పార్కింగ్‌ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్‌ వద్దకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు మరో 25 మందిని అనుమతిస్తామని, ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు అనుమతి ఉంటుందన్నారు. పాత్రికేయులకు హెలీప్యాడ్, రిసెప్షన్‌ వేదిక వద్దకు  అనుమతి ఉండదని చెప్పారు. రిసెప్షన్‌ వేదిక వద్దకు 150 మంది బంధువులు, నాయకులకు అనుమతి ఉంటుందన్నారు. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, డీఎస్పీ శ్రీనాథ్, డీపీఓ రమేష్‌బాబు, ఇంటిలిజెన్స్‌ డీఎస్పీ జి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు