మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్‌ పరామర్శ

26 Sep, 2022 09:05 IST|Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా(అమలాపురం టౌన్‌): గుండె శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ సెంటర్‌లో చేరిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఫోన్‌చేసి పరామర్శించారు. మంత్రి విశ్వరూప్‌కు సోమవారం గుండె శస్త్రచికిత్స చేయనున్నారు.

ఈ క్రమంలో శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని ఆయనకు సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని అన్నారు. సీఎం జగన్‌ తమతో మాట్లాడారని మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి అమలాపురం ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.  

చదవండి: (Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం)

మరిన్ని వార్తలు