క్రిస్మస్‌ ప్రార్థనల్లో సీఎం జగన్‌ 

25 Dec, 2023 03:37 IST|Sakshi
ఇడుపులపాయ చర్చిలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు 

పాల్గొన్న వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతీరెడ్డి  

సాక్షి కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయలో ఉదయం 9.10 గంటల ప్రాంతంలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ బరువెక్కిన హృదయంతో ఘాట్‌ ప్రాంగణంలో అందరినీ పలుకరిస్తూ ముందుకు కదిలారు.  నివాళులర్పించిన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని దివంగత వైఎస్సార్‌ సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం జగన్‌ మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ఉద­యాన్నే ఘాట్‌ వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్‌ సోదరులు వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ సు«దీకర్‌రెడ్డి, సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, వైఎస్‌ జగన్‌ సోదరులు వైఎస్‌ సునీల్‌రెడ్డి తదితరులు నివాళులర్పిం­చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్‌ అవి­నాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, నగర మేయర్‌ సురేష్బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, మంగళగిరి వైఎస్సార్‌ సీపీ మహిళా నేత బొమ్మారెడ్డి సునీత, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ కౌశల్, జేసీ గణేష్‌కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి 
ఇడుపులపాయలోని చర్చిలో జరిగిన ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం జగన్‌ మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, బావమరిది ఈసీ దినేష్రెడ్డి, సోదరుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ సునీల్‌రెడ్డి, చిన్నాన్న, పెద్దనాన్నలు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ తదితరులతోపాటు వైఎస్‌ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవరెండ్‌ ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

మూడు దశాబ్దాలుగా ఆనవాయితీ 
ప్రతి క్రిస్మస్‌కు ముందురోజు కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకోవడం ఎప్ప­టి­నుంచో కొనసాగుతోంది. ఇడుపులపాయ­లోని చర్చి వద్ద ›ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభా­కాంక్షలు తెలియచేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో సీఎం జగన్‌ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకుని ఆప్యా­యంగా పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.

>
మరిన్ని వార్తలు