బ్యాటు పట్టి అదిరిపోయే షాట్లు కొట్టిన సీఎం జగన్‌ 

9 Jul, 2021 16:45 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన పలు కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రికెట్‌ బ్యాట్‌ పట్టారు. అదిరిపోయే షాట్లు కొట్టి అందరూ వన్‌ మోర్‌ అనేలా చేశారు. శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ పర్యటించారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  

ఈ క్రమంలోనే వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఫ్లడ్‌ లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం​గా సీఎం జగన్‌ క్రికెట్‌ బ్యాట్‌ పట్టారు. ఓ బంతిని స్వీప్‌ షాట్‌ కొట్టారు. దీంతో అక్కడివారంతా వన్‌ మోర్‌ అంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఆయన మరో అదిరిపోయే షాట్‌ కొట్టి అక్కడివారిని అలరించారు. అనంతరం బ్యాట్‌, బంతిపై సంతకాలు చేసి ఇచ్చారు.

ఈరోజు(శుక్రవారం) బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం.. రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా బద్వేలులో కూరగాయలు, చేపల మార్కెట్లు‌, వాణిజ్య సముదాయాలు ఏర్పాటుతో పాటు రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు కాల్వల విస్తరణ పనులు,  రూ.56 కోట్లతో తెలుగు గంగ పెండింగ్‌ పనులతో పాటు, రూ.36 కోట్లతో బ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతలకు ఏర్పాట్లు, బ్రాహ్మణపల్లి వద్ద సగిలేరుపై రూ.9.5 కోట్లతో మరో వంతెన నిర్మిస్తామన్నారు. రూ.7.5 కోట్లతో గోదాముల నిర్మాణంతో పాటు బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలను బద్వేలు నియోజకవర్గంలో చేపట్టబోతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు