ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు తప్పనిసరి

9 Oct, 2020 14:25 IST|Sakshi

కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యమిత్రలను తప్పనిసరిగా నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్‌ విధానం అమలు చేయాలని.. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని తెలిపారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ సవాంగ్‌ హాజరయ్యారు. (చదవండి: ఇది మీ మేనమామ ప్రభుత్వం)

‘‘ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్‌, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు ఈ ఆరు ప్రమాణాలు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కచ్చితంగా అమలవ్వాలి. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలి. రోగులకు ఆరోగ్య మిత్రలు పూర్తి స్థాయిలో సేవలందించాలి. 104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలి. అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్‌ కాల్స్‌ చేయాలి. ఫోన్‌ చేసిన అర గంటలో బెడ్ల కేటాయింపు జరగాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ కిట్లు అందాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు