తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు

19 Nov, 2023 05:52 IST|Sakshi

ఘనంగా సామాజిక సాధికార యాత్ర

వేలాదిగా పాల్గొన్న బడుగు, బలహీనవర్గాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్‌ వరకు సాగింది.

బస్సు యాత్రకు నియోజక­వర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టా­రు. తణుకు సెంటర్‌లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. 

రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్‌
బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«­దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధి­కార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడా­నికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.

వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్‌ మాత్రమే­నన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు.  సీఎం జగన్‌ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.

రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్‌ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. 

హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలుకు సూచనగా  ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024­లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటు­డు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా) అలీ చెప్పారు.

2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్‌.. ఈ సారి 175కి 175 నియోజ­కవర్గా ల­నూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉంద­న్నారు. ఆ నమ్మకంతోనే  వైజాగ్‌ సమ్మిట్‌కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రా­మిక­వేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కు­టుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు