బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్‌

26 Sep, 2022 15:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ జరగాలన్నారు. పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలకు కూడా ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.

సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
► పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి.
►అన్నీకూడా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఉండాలి.
►అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలి. 

అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో చర్చ.
►ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సీఎం సమగ్రంగా సమీక్షించారు
►పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశం
►పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలి.
► నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలి. 
►మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలని సూత్రప్రాయ నిర్ణయం. 
► పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలలి. 

బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్‌
► కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. 
►అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టాం. 

ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
► ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలి. 
►అంగన్‌వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్‌వాడీలో ఉంచాలి. 
►పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పగించాలి. 

►సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు.
►సీఎం ఆదేశాలమేరకు అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్న అధికారులు. 
►ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తాం.
►పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉంది.
►పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం.

► దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం ఆదేశం.
► దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. 
►జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సీఎం ఆదేశం. 
►జువైనల్‌ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. 

ఈ సమావేశానికి మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ. ఉషాశ్రీచరణ్, స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌.అనురాధ, మార్క్‌ఫెడ్‌ కమిషనర్‌ పీఎస్‌. ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ.సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: (ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు