కమ్యూనిటీ హాలే.. టీడీపీ కార్యాలయం 

6 Sep, 2021 09:23 IST|Sakshi
కమ్యూనిటీ హాల్‌పై ఇప్పటికీ టీడీపీ గుర్తులు ఉన్న భవనం    

వినుకొండ(నూజెండ్ల): వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారని, కులధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మ ఉండకూడదని కోర్టుల్లో కేసులు వేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులు మాత్రం ఏకంగా ప్రభుత్వ భవనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చారు. వినుకొండ నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో అవుదారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రధాన సెంటర్‌లో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పనులకు ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకున్నారు.

అయితే టీడీపీ హయాంలో సుమారు రూ.15లక్షల ఎంపీ నిధులు, గ్రామస్తుల ఆర్థిక సహకారంతో కమ్యూనిటీ హాల్‌ నిర్మించారు. టీడీపీ పార్టీ రంగులు వేయించి ఎన్‌టీఆర్, టీడీపీ గుర్తులను కూడా వేయించుకుని యథేచ్ఛగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లను వేయించుకుని స్థలదాత పేరును ఒక మూలన రాశారు. గ్రామ సచివాలయాలు నిర్మాణదశల్లో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం అద్దె భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అయితే కారుమంచి గ్రామంలో ప్రభుత్వ భవనాన్ని గ్రామపంచాయతీకి అప్పగించాలని గ్రామస్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు 
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..

మరిన్ని వార్తలు