Cyclone Mocha: తీవ్ర తుపానుగా ‘మోచా’

12 May, 2023 07:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురు­వారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ఉత్తర దిశగా పయనిస్తూ శుక్రవా­రం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మార­నుంది. అనంతరం మలుపు తిరిగి ఉత్తర ఈ­శాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుపా­నుగా బలపడే అవకాశం ఉందని వా­తా­వరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాక్స్‌ బజార్‌ (బంగ్లాదేశ్‌), క్యాక్‌ప్యూ (మయన్మార్‌) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీవ్ర తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటవచ్చని పేర్కొంది.
చదవండి: మళ్లీ గురివింద నిందలే!  

రాష్ట్రంలో వడగాడ్పుల ఉధృతి
రాష్ట్రంలో ఉష్ణతీవ్రత మరింత పెరుగుతోంది. శుక్రవారం నుంచి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వడగాడ్పులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎండీ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు