సీఎం జగన్‌ అండగా నిలిచారు: శ్రీవాత్సవ

13 Oct, 2020 12:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం గురించి సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు ఆరా తీశారని ఆయన కుమారుడు శ్రీవత్సవ అన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురైతే.. పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. మంగళవారం విశాఖలోని ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ద్రోణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, ఎంవీవీ సత్యనారాయణ.. సత్యవతి, గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు శ్రీవాత్సవ మాట్లాడుతూ..​ సీఎం వైఎస్‌ జగన్‌ తమకు అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. పార్టీలో ఆలస్యంగా చేరిన తన తండ్రికి సీఎం జగన్‌ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. తన నాన్న ఆరోగ్యం గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు తన తండ్రి చనిపోయారని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు తమకు అండగా నిలిచారని చెప్పారు.

సంస్మరణ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మనసులో ద్రోణంరాజు శ్రీనివాస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చివరిసారిగా తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీవత్సవను బాగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ద్రోణంరాజు కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ద్రోణంరాజు కుటంబానికి అండగా ఉంటారని చెప్పారు. శ్రీవత్సవ తన తండ్రి బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, విశాఖ నగరంతో విడదీయరాని బంధం ద్రోణంరాజు కుటుంబానికి ఉందని తెలిపారు. పార్టీ తరుఫున ద్రోణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ద్రోణంరాజు సంస్మరణ సభలో పాల్గొటనని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనే మనుషులను ఎన్నడూ సీఎం జగన్‌ వదులుకోరని తెలిపారు. వైఎస్, ద్రోణంరాజు కుటంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ద్రోణంరాజు ఓడిపోయినప్పటికీ సీఎం జగన్  వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా