చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్‌.. వారందరికీ ఈడీ నోటీసులు

4 Dec, 2022 12:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫోకస్ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 2014-19 మద్య కాలంలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చంద్రబాబు హయాంలో రూ.3,350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు.

ఇందులో నుంచి రూ.241 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్‌డెవలప్‌మెంట్‌లో నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ మేరకు నిర్ధారణ అయింది. దీంతో స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పలు షెల్‌ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ, ఓఎస్‌డీ కృష్ణప్రసాద్‌లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం రోజున హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది. 

చదవండి: (Hyderabad: రేవ్‌పార్టీ భగ్నం.. పట్టుబడిన 33 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు)

మరిన్ని వార్తలు