Fact Check: ఈనాడు ఆరోపణలు అవాస్తవం

10 Oct, 2023 05:46 IST|Sakshi

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల ఎంపానల్‌మెంట్‌ పూర్తి పారదర్శకం

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీహెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో 

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రుల ఎంపానల్‌మెంట్‌ ప్రక్రి­యను ఆన్‌లైన్‌లో పూర్తి పాదర్శకంగా నిర్వ­హిస్తున్నట్టు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దీపక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ముడు­పులు అందితేనే ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అంటూ ఈనాడులో సోమవారం ప్రచురించిన కథ­నంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొ­న్నారు.

ఎంపానల్‌మెంట్‌ అవడానికి నిర్దేశించిన సదుపాయాలున్న ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పోర్ట­ల్‌ అందుబాటులో ఉండే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తుల్ని నిర్ణీత సమయపాలనతో పరిశీలి­స్తు­న్నట్లు తెలిపారు. ఎంపానల్‌మెంట్‌ ప్రక్రియ­లో మాన్యువల్‌ ప్రమేయం ఏమీ ఉండదని పే­ర్కొ­న్నారు. ఏవైనా లోపాలుంటే ఆ వివరణ­లతో ఆన్‌లైన్‌లోనే ఆస్పత్రులకు నోటీసులు వెళతాయని తెలిపారు. ఇక రోగులకు వైద్య­సేవల కోసం ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్‌), క్లెయిమ్‌లు ఆన్‌లైన్‌లో వివిధ స్థాయిల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా పరిశీలి­స్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులను, వైద్యసేవలకు సంబంధించి ప్రజ­లను ఎవరైనా లంచాలు డిమాండ్‌ చేస్తే నేరుగా 104 (ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల నంబరు), 14400 (అవినీతి నిరోధక విభాగం) నంబర్లకు ఫోన్‌­చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆస్ప­త్రుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పరిష్కార సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల యాజమాన్యాలు సమస్యలను cgro@aarogyasri.ap.gov.in  కు మెయిల్‌ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు