ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట?  

11 Dec, 2022 03:39 IST|Sakshi

కులమతాలు, పార్టీలకు అతీతంగా... నూరు శాతం అర్హులకు ప్రభుత్వ పథకాలు

వలంటీర్ల ఎంపికలో అర్హతా ప్రమాణాలకే పెద్ద పీట

రాజకీయ జోక్యానికి తావులేకుండా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తున్న అధికారులు

నియామకాల్లో రిజర్వేషన్ల అమలు... అందుకే 55 శాతం మహిళలకే

96 శాతం వలంటీర్లు 35 ఏళ్ల లోపువారే... 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే

ఇదో అద్భుతమైన వ్యవస్థంటూ ప్రశంసించిన కేరళ, యూనిసెఫ్‌

తమ రాష్ట్రంలోనూ ఆరంభించేందుకు కేరళ యోచన

ఏపీలో తమ కార్యక్రమాల అమలుకు ఇప్పటికే యూనిసెఫ్‌ ఒప్పందం

పథకాల అమల్లో మంచిపేరుతో ‘ఈనాడు’కు కడుపు మంట

వలంటీర్ల వ్యవస్థకు రాజకీయ మకిలి అంటించటం ద్వారా పబ్బం గడుపుకునే ప్రయత్నం  

ఆసుపత్రిలో ఉన్న ఓ అవ్వకు... 1వ తేదీన ఠంచనుగా అక్కడికే వెళ్లి పింఛను అందజేశాడు ఓ వలంటీరు. 
జోరుగా వర్షం కురిసి రోడ్ల నిండా నీరునిండిపోయింది. తెల్లవారుఝామునే... వర్షానికి తడుస్తూ ఆ నీట్లోనే వచ్చి ఓ తాతకుపింఛను అందించింది మరో వలంటీరు.

మరి వీళ్లలో వైసీపీ వాళ్లెవరు? ఆ అవ్వ, తాత వైసీపీ నాయకులా? వాళ్లకు పింఛన్లివ్వటంవైఎస్సార్‌ సీపీకి సేవ చేయటమా? వాళ్లకు పింఛన్లందించిన వలంటీర్లు వైసీపీ వేగులా? ఇలా ఇవ్వటం గూఢచర్యమా?ఏ కొంచెం కూడా దురి్వనియోగానికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలను ఇలా జనానికి చేరవేస్తుండటం రాజకీయ కార్యకలాపమా?
  
యావత్తు దేశాన్నీ కోవిడ్‌ మహమ్మారి చుట్టేసి... ఇళ్లలోంచి బయటకు రావటానికే జనం భయపడుతున్నపుడు... ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎవరెవరికి అనారోగ్య లక్షణాలున్నాయో ‘సర్వే’ పేరిట తెలుసుకోవటం వ్యక్తిగత గోప్యతకు భంగమా? ప్రతి ఇంటికీ మాసు్కలు, మందులతో పాటు పచారీ సామాన్లు కూడా అందించిన స్వచ్ఛంద సైన్యంపై ఎందుకింత కడుపుమంట? పథకాల దురి్వనియోగానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా నూరుశాతం అర్హులకు చేరవేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ఎందుకీ విద్వేషం?  

వృద్ధులు కానీండి... అనారోగ్యంతో తల్లడిల్లుతున్నవారు కానీండి... ఆఖరికి వికలాంగులు కానీండి. ఎవ్వరైనా పడుతూ లేస్తూనైనా తాము చెప్పిన చోటుకు వస్తేనే పింఛను. అక్కడికొచ్చి గంటలకొద్దీ వేచిచూస్తే... ఆ రోజు అదృష్టం బాగుంటే పింఛను దొరుకుతుంది. లేదంటే మరోరోజు రావాల్సిందే. అది ఎండైనా.. వానైనా. ఇదీ.. ఘనత వహించిన నారా చంద్రబాబు నాయుడి హయాంలో పింఛన్ల తంతు. కానీ ‘ఈనాడు’ దృష్టిలో అదే స్వర్ణయుగం. ఇప్పుడు ఆ పింఛనుదార్లకు గౌరవమిస్తూ... వారి వద్దకే వెళ్లి అందజేస్తున్న వలంటీర్లు మాత్రం వైసీపీ వేగులట!!. అలా ఇవ్వటం రాజకీయ కార్యకలాపమట. అది పార్టీ సేవ అట!!.  

52 ఏళ్లు నిండిన ‘ఈనాడు’ బుద్ధి ఎక్కడికిపోయింది? వయసు మీద పడటంతో రామోజీరావుకు, చంద్రబాబుకు ఆలోచనలన్నీ అరికాళ్ల నుంచే పుట్టుకొస్తున్నట్టున్నాయి. ఏళ్లు పెరుగుతున్న కొద్దీ ‘ఈనాడు’ కూడా వీళ్లమాదిరే తయారవుతోందా? అక్షరమక్షరంలోనూ ఇంతటి విషాన్ని నింపుకున్న పత్రికలో ఏ ఒక్క వార్తయినా నిజమని నమ్మగలమా?  ఎంత చంద్రబాబుకు అమ్ముడుపోతే మాత్రం మరీ ఇంతకు దిగజారిపోతారా రామోజీ? కేరళలాంటి రాష్ట్రాలు సైతం ఈ స్వచ్ఛంద సైన్యాన్ని చూసి తమ రాష్ట్రంలో కూడా నియమించాలని యోచిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తరఫున అంతర్జాతీయంగా బాలల విద్య కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌ కూడా రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ అద్భు­తమని ప్రశంసించింది.

అంతేకాక రాష్ట్రంలో తమ కార్యక్రమాలను నిరుపేదలకు చేర్చడానికి ఈ వ్యవస్థతో కలిసి పనిచేసేలా ఒప్పందం కూడా చేసుకుంది. మరి ఇంత గొప్ప వ్యవస్థలో మీకు ఒక్క మంచి లక్షణం కూడా కనిపించలేదంటే మీ దుర్మార్గపు స్థాయిని అంచనా వేయడానికి ఏ కొలమానం సరిపోతుంది రామోజీరావు గారూ? ఇక హద్దులు లేవన్న రీతిలో నానాటికీ పతనమైపోతున్న మీ పాత్రి­­కేయం ఇంకెన్నాళ్లు? ఇంతలా చంద్రబాబు మోహంలో పడిపోతే ఎలా? అసలు వలంటీర్ల వ్యవ­స్థ రాష్ట్రంలో ఎందరి జీవితాలను నిలబెడుతోందో తెలు­సా? ఎంత అద్భుతంగా పనిచేస్తోందో తెలుసా?  

అర్హులెవ్వరికైనా అన్యాయం జరిగిందా? 
ప్రజల బతుకులు బాగు చేయటానికి... జనం జీవితాలు మెరుగుపడటానికి ప్రభుత్వం రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలన్నిటి లక్ష్యం ఒక్కటే. ప్రజల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం. ప్రతి పథకానికీ ప్రభుత్వం కొన్ని అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తే... అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా వాటిని చేరవేస్తోంది వలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలియటానికి రామోజీరావుకు ఒక్కటే ప్రశ్న. తెలుగుదేశం పార్టీ వారన్న కారణంతోనో, వేరే కులానికి చెందిన వారన్న కారణంతోనో అర్హులైన ఏ ఒక్కరికైనా ఒక్క పథకమైనా అందకుండా పోయిందా? అలాంటి వాళ్లను చూపించగలరా? అదే కదా వలంటీర్ల వ్యవస్థకు గీటురాయి!. అదే కదా ప్రభుత్వ పనితీరుకు కొలమానం!. మరి చంద్రబాబు పాలననే తీసుకుందాం.

ప్రభుత్వ పథకాలను జనానికి చేరవేయటానికి ఆయన నియమించుకున్నది జన్మభూమి కమిటీలను. అందులో ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్లను నియమించింది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన టీడీపీ ఇన్‌ఛార్జులు. నేరుగా నామినేట్‌ చేసేసేవాళ్లు. ఇక ఆ కమిటీలన్నీ తెలుగుదేశం వారి కోసమే పనిచేసేవి. అర్హత ప్రమాణాలన్నీ పేరుకే. ఏ పథకానికైనా అసలైన అర్హత తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండటమే. ఆ గ్రామంలో ఉండే వ్యవస్థంతా జన్మభూమి కమిటీల సూచనల మేరకు పనిచేస్తే... జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు సూచనల మేరకు పనిచేసేవి. మరి ఇప్పుడో..? 

నియామకాలు చేస్తున్నది అధికారులే కదా? 
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేర్చటమే ధ్యేయంగా 2,61,413 మంది వలంటీర్లను ప్రభుత్వమే నియమించింది. గౌరవ పారితోíÙకంతో స్వచ్ఛంద సేవ అందించే ఈ వలంటీర్ల నియామకంలో... రాజకీయ జోక్యానికి తావే లేదు. పార్టీలు లేవు... కులమతాల పట్టింపు లేదు. స్త్రీ,పురుష భేదాల్లేవు. నిరీ్ణత విద్యార్హతలున్నవారిని గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఛైర్మన్‌గా, తహసీల్దారు, విస్తరణ అధికారి సభ్యులుగా ఓ కమిటీ నియమిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్‌ కమిషనర్‌ చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, ప్రాజెక్టు అధికారి లేదా మెప్మా టౌన్‌ మిషన్‌ కో–ఆర్డినేటర్‌ సభ్యులుగా ఉన్న కమిటీ నియమిస్తోంది. ఈ కమిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయమే లేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు వచ్చే ఖాళీలను భర్తీ చేయటానికి స్థానికంగా ఉండే ఎంపీడీఓ లేదా కమిషనర్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి, రిజర్వేషన్లు, రోస్టర్‌ ప్రకారం వాలంటీర్లను ఎంపిక చేస్తున్నారు.  

ఏ పార్టీ వారైనా ఉండొచ్చు... 
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వలంటీర్లలో తెలుగుదేశం, వైఎస్సార్‌ సీపీ, జనసేన అభిమానులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నియమించే ముందు వారి వయసు, విద్యార్హతలు, సేవాభావమే ప్రామాణికంగా తీసుకున్నారు తప్ప వారి రాజకీయ నేపథ్యాన్ని చూడలేదు. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న 2.61 లక్షల వలంటీర్లలో 74 శాతం మంది 20–30 ఏళ్ల మధ్య ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే... 96 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. అందుకే అత్యంత వేగంగా తమ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. పైపెచ్చు ఈ వలంటీర్లలో 55.12 శాతం మంది మహిళలే. గ్రామంలో గౌరవంతో పాటు కాస్త పారితోíÙకం... ఊరికి సేవ చేశామన్న తృప్తి ఉంటాయనే వీరంతా ఈ బాధ్యతల్లోకి వస్తున్నారు. మరి ఈ మహిళలకు సైతం పార్టీలు అంటగట్టి, వీళ్లందరినీ వైసీపీ వేగులుగా ముద్రవేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ను ఏం చేయాలి? దారుణమైన రాతలతో పచ్చి విషాన్ని కక్కుతున్న రామోజీరావును ఏం చేయాలి? 

ఎన్నెన్ని బాధ్యతలో... 
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించటంలో వలంటీర్ల వ్యవస్థ ఎండావానలను లెక్క చేయక... చలికి భయపడక అహరి్నశలూ  పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. 2019 జూన్‌ నుంచి ఈ వ్యవస్థ ప్రతినెలా దాదాపు 62.5 లక్షల మందికి... రూ.1,600 కోట్ల చొప్పున పంపిణీ చేస్తోంది. కొత్త రైస్‌ కార్డులు మంజూరు చేయటంతో పాటు రైస్‌ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ వ్యవస్థ. ఇంకా వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కలి్పంచటం చేస్తోంది. ఇవే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్‌ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్‌ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆరి్థక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు.  

ప్రభుత్వ విభాగాలకూ సహాయంగా... 
ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. సొంతిళ్లున్న వారిని ఆస్తిపన్ను చెల్లించమని అభ్యర్థిస్తున్న వలంటీర్లు... స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే, మనం మన పరిశుభ్రత, ఫ్రైడే–డ్రైడే, చెత్త పన్ను వసూలు... ఇలాంటి అంశాలన్నిటా వినియోగదార్లకు అవగాహన కలి్పస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగానికి, పంచాయతీ రాజ్‌– గ్రామీణాభివృద్ధి విభాగానికి సహకరిస్తున్నారు.  

- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు.  
- వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లకు, ఫీవర్‌ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం.  
- వలంటీర్ల సాయం లేకుంటే ఆర్‌బీకే సిబ్బంది ఈ–క్రాప్‌ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు.  
- ప్రత్యేక వాహనాల్లో రేషన్‌ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వలంటీర్లదే. 
- ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛందంగా కదనరంగంలోని సైనికుల్లా సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచి్చన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు.  

మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వలంటీర్లపై రామోజీరావు వైసీపీ ముద్ర ఎందుకు వేస్తున్నారు? ఏదో ఒకరకంగా వాళ్లను తమ విధులకు దూరం చేద్దామనా? ఈ రాష్ట్రంలో అర్హులకు పథకాలు అందకుండా చేసి... ప్రభుత్వానికి ఆ మకిలిని అంటిద్దామనా? ఇంతకన్నా ఘోరమైన కుట్రేదైనా ఉంటుందా రామోజీ? 

కోవిడ్‌ సమయంలో ప్రపంచమే జేజేలు కొట్టింది... 
2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్‌ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసుపత్రులలో బెడ్‌లు సైతం దొరక్క విలవిలలాడినపుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్‌ రోగులు సైతం నిబంధనలకు గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే... ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే... అది ఈ ప్రభుత్వం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోవిడ్‌ మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో.. బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పని చేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించటంతో పాటు 16 కోట్ల మాసు్కల్ని జనానికి అందజేశారు.

పేదలకు ప్రత్యేక సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించటంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్‌ సెంటర్లలో సేవలందించటంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్‌ సర్వే చేశారు. అన్నిటికన్నా ప్రధానం... కోవిడ్‌ మృతుల భౌతికకాయాలను దహనం చేయటంలోనూ సాయపడ్డారు. అలాంటి సేవలకు యావత్తు దేశం జైకొట్టగా... రామోజీరావు మాత్రం రాజకీయాలు అంటగడుతూ చెలరేగిపోతుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదనే చెప్పాలి. 

కులమతాలకు అతీతంగా... 
చంద్రబాబు మదిలోంచి పుట్టిన జన్మభూమి కమిటీలన్నీ  కులం కంపు కొట్టేవని వేరే చెప్పక్కర్లేదు. ఏ గ్రామాల్లోనైనా అక్కడ పెత్తనం చెలాయించే వారే కమిటీల్లో ఉండేవారు. కానీ వలంటీర్ల వ్యవస్థలో ఒక కులం, మతం వాళ్లే కొనసాగడం లేదు. వాలంటీర్లుగా ఉన్న వారిలో 14 శాతం మంది మాత్రమే ఓసీలు. ఎస్‌సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం. మరో 18 శాతం మంది ఇతరులున్నారు. అసలు 55 శాతం మంది మహిళలున్నప్పుడు ‘ఈనాడు’ రాసేసినట్లు­గా వాళ్లు వేగులుగా పనిచేయటం సాధ్యమా? 68 శాతం మంది ఎస్‌సీ, ఎస్టీ, బీసీలు ఉండగా వాళ్లంతా ఒక పార్టీకే పనిచేస్తున్నారనడంలో అర్థం ఉందా?   

ఈ సవాళ్లకు సిద్ధమా రామోజీ? 
- చేతిలో పత్రిక ఉంది కదా అని అడ్డగోలుగా ఆరోపణలు చేసే రామోజీరావు సూటిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది... ఈ వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఎప్పుడైనా తనవి కాని కార్యక్రమాలకు వాడిందా?.
- ఎందుకంటే ప్రభుత్వ పథకాలను స్థానికులకు అందించటం... వారికి ఆయా పథకాలపై అవగాహన కల్పించటమే వీరి విధి. ఇది తప్ప ఇతర కార్యక్రమాలకు వీరిని ఎన్నడైనా వాడారా? చెప్పండి రామోజీ?.
- ఓ సర్వేలో రాజకీయ ఆసక్తిని అడిగారంటూ మీరు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టిన ఏ సర్వేలోనూ ఇప్పటిదాకా పౌరుల రాజకీయ ఆసక్తిని అడిగింది లేదు.  
- వలంటీర్లు ఎన్నడైనా ఏ రాజకీయ కార్యకలాపాల్లోనైనా పాల్గొన్నారా? అలా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారా? తెలిస్తే చెప్పండి రామోజీ? నిజానికి ఏ వలంటీరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై ‘స్పందన’ కార్యక్రమంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. - ఇప్పటిదాకా 24,704 ఫిర్యాదులు రాగా వాటిలో 24,643 పరిష్కారమయ్యాయి. ఆరోపణలు రుజువు కావటంతో ఇప్పటికే 20 మంది వలంటీర్లను తొలగించారు కూడా. ఇలాంటి వాస్తవాలు చెప్పటం కూడా అలవాటు చేసుకోండి రామోజీరావు గారూ!!.   

రామోజీ దుర్మార్గపు రాతలప్రకారం చూస్తే..
వాళ్లంతా ఒకే పార్టీకి పనిచేస్తుండాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లపై ప్రత్యర్థి పారీ్టల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి ఉండాలి కదా? కానీ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన రెండున్నర సంవత్సరాల తర్వాత 2021 జనవరిలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఆరుగురు వలంటీర్లపై మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. మరి ఆ జిల్లాలో వేల సంఖ్యలో వలంటీర్లున్నారు కదా? రామోజీ చేసిన మరో దుర్మార్గపు ఆరోపణ ఏంటంటే వలంటీర్ల వల్ల ప్రభుత్వానికి వందల కోట్లు ఖర్చవుతోందని!!.

నిజానికి రాష్ట్ర ప్రభుత్వం 33 సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడున్నరేళ్లలో సుమారు రూ.3.60 లక్షల కోట్లు ప్రజలకు ఆరి్థకంగా సాయం చేసింది. పైసా అవినీతికి తావు లేకుండా ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు చేర్చటంలో వలంటీర్ల పాత్ర అత్యద్భుతం. ప్రతి పథకానికీ ఎంపిక చేసే ముందు లబ్థిదారుడి వద్దకు వెళ్లి బయోమెట్రిక్‌ తీసుకొని, అమలు చేశాక అతనికి అందిందని ధ్రువపరచుకునేందుకు మరో సారి బయోమెట్రిక్‌ తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల అడ్డుకట్ట పడిన అవినీతితో పోలిస్తే వీరికి చెల్లించిన మొత్తం ఎక్కువని అనుకోగలమా? ఈమా­త్రం జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోతే ఎలా? 

మరిన్ని వార్తలు