ప్రభుత్వాఫీసుల్లోనూ ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌

19 Aug, 2022 09:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ వ్యవస్థను తీసుకురానున్నామని.. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఉపాధ్యా య సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్‌ నమోదు కోసం రూపొందించిన యాప్‌ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆఫీస్‌ సబార్డినేట్‌ వరకు అందరూ ఈ ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా తొలుత విద్యాశాఖ లో దీనిని ప్రవేశపెట్టామన్నారు. అటెండెన్స్‌ యాప్‌ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశా రు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల దృక్పథంతోనే విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నామని, వాటిని అమలుచేయడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించ డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్స తెలిపా రు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌కు సం బంధించిన యాప్‌ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిందని.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహా లను నివృత్తిచేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారం పై మంత్రి స్పష్టతనిస్తూ.. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నామని,  కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్‌ డే లీవ్‌ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు.  రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యా ప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దాని వినియోగాన్ని అల వాటు చేసుకునేందుకు 15 రోజులను ట్రైనింగ్‌ పీరి యడ్‌గా పరిగణించాలని నిర్ణయించామన్నారు. 

5 జూనియర్‌ కాలేజీలు క్లస్టర్‌ కళాశాలలుగా మార్పు
మరోవైపు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలోని ఐదు జూనియర్‌ కాలేజీలను గుర్తించి వాటిని క్లస్టర్‌ జూనియర్‌ కాలేజీలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిల్లో వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్, లాంగ్వేజ్‌ల్యాబ్స్, డిజిటల్‌ బోర్డ్స్‌ ఇతర ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై చర్చిం చారు. ఇంటర్‌ విద్యాశాఖ సర్వీస్‌ అంశాలపై ఇంట ర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా పలు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా విశాఖపట్నంలో రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి ఆమోదం తెలిపారు. నాడు–నేడు కింద ఉన్న అన్ని జూనియర్‌ కళాశాలల్లోని అన్ని తరగతులకు డిజిటిల్‌ బోర్డుల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. సమావేశంలో మండలి కార్యదర్శి శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ‘టీడీపీ కుట్ర బట్టబయలు.. ఫేక్‌ సర్టిఫికెట్‌తో దొరికిపోయిన బాబు అండ్‌ గ్యాంగ్‌’

మరిన్ని వార్తలు