రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి: మంత్రి రజని

7 Oct, 2022 15:21 IST|Sakshi

సాక్షి, గుంటూరు: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి విడుదల రజని తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నాడు-నేడు కింద రూ. 16 కవేల కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 

600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి జింఖానా వారు 80 కోట్లు ఇవ్వటం గర్వకారణమన్నారు. జింఖానా సభ్యులు అమెరికాలో ఉన్నప్పటికీ.. ఇక్కడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే వాళ్ల ఉద్దేశ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బిడ్డను ఎలుకలు కొరిగేసిన ఘటనలు.. కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేసిన సంఘటన కూడా అందరికీ గుర్తున్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు