పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్

26 Sep, 2023 16:08 IST|Sakshi

తిరుపతి: తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. 33 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. గుంటూరులో బ్రెయిన్‌డెడ్‌ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం గుంటూరు నుంచి ప్రత్యేక చాపర్‌లో గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రికి తరలించారు. గుండె తరలింపునకు సీఎం జగన్ చొరవతో ప్రత్యేక చాపర్‌ను ఏర్పాటు చేశారు.  

సీఎం జగన్ చొరవతో రెండేళ్ల కిందటే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్‌ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తున్నారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అనతికాలంలోనే ది బెస్ట్‌గా గుర్తింపు సాధించింది.

ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి

మరిన్ని వార్తలు