వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

22 Jul, 2021 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు