గడప గడపనా అపూర్వ ఆదరణ

29 May, 2022 04:49 IST|Sakshi
కాకినాడ జిల్లా చెందుర్తిలో గృహిణితో మాట్లాడుతున్న ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు

సాక్షి నెట్‌వర్క్‌: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ పలకరింపుల నడుమ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం 18వ రోజైన శనివారం సందడిగా సాగింది. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల రాకతో ఊరూరా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. లబ్ధిదారులకు సీఎం జగన్‌ రాసిన లేఖలను ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. 

మరిన్ని వార్తలు