సీఎం జగన్‌: ఏపీకి జలాభిషేకం

21 Dec, 2023 05:47 IST|Sakshi

వరుసగా నాలుగేళ్లుగా కోటి ఏకరాలకు సాగునీరు

పులిచింతల ఫుల్‌2019 ఆగస్టులో తొలిసారిగా 45.77 టీఎంసీల నిల్వ

రూ.500 కోట్లుతెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్‌ కెనాల్‌ లైనింగ్‌ పూర్తి

 వరుసగా నాలుగేళ్లుగా కోటి ఎకరాలకు సాగునీరు

 సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు, లక్కవరం ఎత్తిపోతల, అవుకు రెండో టన్నెల్‌ జాతికి అంకితం

తుది దశలో వెలిగొండ.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌

పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతిలో గరిష్టంగా నిల్వ

 పోలవరంలో తప్పిదాలను సరిదిద్దుతూ వేగంగా సీఎం జగన్‌ అడుగులు

సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్‌ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్‌ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక  ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్‌ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా సీఎం జగన్‌ నిలిపారు.


♦ వైఎస్సార్‌ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం జగన్‌ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.
♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్‌ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.
♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను పూర్తి చేసి నవంబర్‌ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్‌ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. 
 ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఫైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌­లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీ­ఆర్‌­ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగా«­దాలను పూ­డ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. 

నీటి పారుదలలో రికార్డు
♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్‌ సాకారం చేశారు.  గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్‌  2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.

♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.

♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్‌ కెనాల్‌కు రూ.500 కోట్లతో లైనింగ్‌ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం జగన్‌ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు డయాఫ్రమ్‌ వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. 

♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్‌ రికార్డు సృష్టించారు.  

>
మరిన్ని వార్తలు