Pawan Kalyan: మీడియా ఎదుట రెచ్చిపోయిన పవన్‌.. బూతులు మాట్లాడుతూ.. 

18 Oct, 2022 15:40 IST|Sakshi

సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి రెచ్చిపోయారు. తనదైన సినిమా స్టైల్‌లో ఆవేశంతో ఊగిపోతూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. కాగా, పవన్‌ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్‌ లీడర్‌ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్‌ చేశారు. 

అక్కడే ఫలితంలేకనే విజయవాడకు పయనం..
ఇదిలా ఉండగా.. విశాఖ గర్జన సందర్భంగా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు  మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం, పవన్‌ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేతలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. 

దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రుల కార్లపై దాడులకు పాల్పడి అరెస్ట్‌ అయిన రౌడీ మూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్‌ బీరాలు పలికారు. ఇలా, మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్‌ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. 
ఇది కూడా చదవండి: ‘ పవన్.. ఓపెనింగ్‌ షాట్‌లు, క్లైమాక్స్‌ డైలాగులు తప్ప నువ్వేమీ పీకలేవు’

మరిన్ని వార్తలు