తిరుమలలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

19 Dec, 2023 08:16 IST|Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18  కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 61,499 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,789. మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.14 కోట్లు ఆదాయం వచ్చింది.  టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. 

నేడు విఐపీ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం, సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. తిరుమంజనం సందర్భంగా అష్టదళ పాద పద్మ ఆరాధన సేవ రద్దు. 23 న వైకుంఠ ఏకాదశి, టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం  సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు.

>
మరిన్ని వార్తలు