శ్రీవాణి దర్శన టికెట్‌ కౌంటర్‌ మార్పు

15 Dec, 2023 21:26 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబ‌రు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్ర‌తి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది.

విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమ‌తి లేని కార‌ణంగా డిసెంబ‌రు 16వ తేదీ   నుంచి  విమానాశ్రయంకు బ‌దులుగా తిరుమ‌ల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో జారీ చేయనున్నారు. ప్ర‌తి రోజు 100 టికెట్ల‌ను బోర్డింగ్ పాస్ స‌మ‌ర్పించిన భ‌క్తుల‌కు య‌ధావిధిగా శ్రీవాణి ద‌ర్శ‌న ఆఫ్‌లైన్ టికెట్ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు.

చదవండి: కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.30 లక్షల చెక్‌ అందించిన సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు