కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా

9 Jul, 2021 05:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: తెలంగాణ సర్కార్‌ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్‌ అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తుండటం వల్ల కృష్ణా జలాలు కడలి పాలవుతున్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సార్లు ఫిర్యాదు చేసింది. ఈ వివా దంపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు 2న రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు లేఖ రాసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు