వ్యసన విముక్తి కేంద్రాలను బలోపేతం చేయాలి 

8 Jun, 2022 05:21 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న లక్ష్మణరెడ్డి

మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి 

నెహ్రూ నగర్‌ (గుంటూరు ఈస్ట్‌): ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన వ్యసన విముక్తి (డీ అడిక్షన్‌) కేంద్రాలను బలోపేతం చేయాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం గుంటూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో 50 పడకల డీ–అడిక్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, అన్ని టోల్‌గేట్‌ల వద్ద బ్రీత్‌ ఎనలైజర్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలని కోరారు. ఇందుకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలపై సరైన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ముత్యాలరాజును ఆదేశించారు.  

మరిన్ని వార్తలు