చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుతపులి కలకలం.. ఆలయంలో పులి పాదాల గుర్తులు

30 Aug, 2022 09:20 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో చిరుతపులి కలకలం సృష్టించింది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు.

అదే సమయంలో చిరుత గుడిలో నుంచి గోడదూకి పారిపోయినట్లుగా పూజిరి చెప్తున్నారు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు చిరుత కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. 

చదవండి: (ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి)

మరిన్ని వార్తలు