‘మహిళలకు పండగ వాతావరణం నెలకొంది’

17 Sep, 2020 15:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సున్నా వడ్డీ, ఆసరా, చేయూత పథకాల ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోకి పొదుపు సంఘాల మహిళ ఖాతాల్లో 45 వేల కోట్ల రూపాయలు జమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేటితో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలు ముగియడంతో చివరి రోజు జరిగిన ఈ వేడుకల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28,29,31 డివిజన్లలోని పొదుపు సంఘాల లబ్ధిదారులకు మల్లాది విష్ణు ఆసరా చెక్కును అందజేశారు. ('మహిళల జీవితాలను మార్చడానికే ఆ పథకం')

ఆయన మాట్లాడుతూ.. ‘2019 మార్చి నాటికి బకాయిలు ఉన్న పొదుపు సంఘాలకు నాలుగు విడతల్లో రుణ మాఫీ చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోని రాగానే ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు. గత ప్రభుత్వం మీటింగ్‌లకు, బల ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా డ్వాక్రా సంఘాలను చూశారు. మహిళల జీవన స్థితిగతులు మెరుగుపడి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చెయ్యాలనాదే సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దేశ్యం. ప్రతిపక్షాల మాటలను విలువ లేదు. సీఎం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. నగదు బదిలీ ద్వారా ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడతాయని మేధావులే చెబుతున్నారు. ఆసరాతో వారం రోజులుగా ఏపీ మహిళాలకు పండగ వాతావరణం నెలకొంది.’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు