లిఫ్ట్‌ ప్రమాదం.. గాయపడిన తిరుమల భక్తుడు

11 Nov, 2020 15:12 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిఫ్ట్‌ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్‌ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్‌ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా