తిరుపతి: ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి

8 Nov, 2023 09:38 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతిచెందింది. చిత్తూరు జిల్లా మాదమరి మండలంలో పంటపొలాల విధ్వంసంలో ఏనుగుకు గాయాలవ్వగా అటవీశాఖ సిబ్బంది జూపార్క్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగుకి గాయాలు కావడంతో జూపార్క్‌లో చికిత్స అందించారు. 

చికిత్స పొందుతూ ఎ‍స్వీ జూపార్కులో మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఏనుగు కళేబరానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు సదుం మండలం గంటా వారి పల్లి పంట పొలాలలో విద్యుత్ షాక్‌ తగిలి మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు