45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్: సుచరిత

7 Jun, 2021 12:45 IST|Sakshi

ఏటుకూరులో వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

సాక్షి, గుంటూరు: నలభై ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సోమవారం ఆమె ఏటుకూరులో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కేవలం రెండేళ్లలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్షా 31 వేల కోట్లు వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని, ఎన్నికల్లో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు.

‘‘గతంతో పోలిస్తే క్రైమ్‌ రేట్‌ చాలా తగ్గింది. చిత్తూరు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిని వ్యక్తికి 7 నెలల్లోనే.. ఉరిశిక్ష పడేలా చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. టీడీపీ హయాంలో రిషితేశ్వరి హత్య జరిగితే ఏం చేశారో అందరికీ తెలుసు. దిశ చట్టం కింద 500 కేసుల్లో శిక్షలు ఖరారు చేశాం. విశాఖలో కర్ఫ్యూ సమయంలో బయటికొచ్చిన యువతి వద్ద పాస్‌ లేదు. అనుమతి పత్రాలు లేకపోవటంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులతో వాదన పెట్టుకుంది. సోషల్‌ మీడియాలో వచ్చినవే నిజాలు అనుకోకూడదని’’ మంత్రి సుచరిత అన్నారు.

చదవండి: ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం
Coronavirus: ఆరోగ్యానికి అడ్డదారులు లేవు

మరిన్ని వార్తలు