కార్తిక మాసోత్సవాలకు పెదకాకాని సిద్ధం | Sakshi
Sakshi News home page

కార్తిక మాసోత్సవాలకు పెదకాకాని సిద్ధం

Published Tue, Nov 14 2023 1:02 AM

మల్లేశ్వరస్వామి - Sakshi

పెదకాకాని: కార్తిక మాసోత్సవాలకు పెదకాకాని శివాలయం ముస్తాబైంది. భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. దర్శనానికి ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సందర్శకులకు తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు ఆలయ సహాయ కమిషనర్‌ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు, అగ్నిమాపక, పంచాయతీ, వైద్యఆరోగ్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించినట్టు ఈఓ ఎన్‌.శ్రీనివాసరెడ్డి, పాలక మండలి చైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకరరావు తెలిపారు. కార్తిక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు
1/1

దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు

Advertisement
Advertisement