అత్యాచార బాధితురాలికి ఎమ్మెల్యే పరామర్శ

8 May, 2022 23:58 IST|Sakshi
బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే గణేష్‌  

నర్సీపట్నం: అత్యాచారానికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న  బాలికను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ శనివారం పరామర్శించారు. బాలిక  ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సమకూర్చిన రూ.2 లక్షల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు.

ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, కౌన్సిలర్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, కోఅప్షన్‌ సభ్యులు షేక్‌ రోజా, పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, గుడబండి నాగేశ్వరరావు,  మామిడి శ్రీనివాసరావు, అయ్యరక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, బుజ్జి, లలిత ఉన్నారు.

మరిన్ని వార్తలు