సీఎం జగన్‌ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం

10 Aug, 2021 09:06 IST|Sakshi

‘‘25 ఏళ్లుగా ఎంపీడీఓగా పనిచేస్తున్నా.. ఇప్పటివరకూ ఉద్యోగోన్నతి లేదు. ప్రమోషన్‌ సాధించాలనేది మా ఎంపీడీఓల కల. ఆ కలను సాకారం చేసిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి’’ అంటూ గుంటూరు జిల్లా దాచేపల్లి ఎంపీడీఓ వై.మహాలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఎంపీడీఓల ఉద్యోగోన్నతికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మహాలక్ష్మీకి కూడా పదోన్నతి లభించింది.

ఈ సందర్భంగా దాచేపల్లిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెండుచేతులూ జోడించి నమస్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కటకం బ్రహ్మనాయుడు, కందుల జాను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, ఈఓపీఆర్డీ మంగేశ్వరరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
- దాచేపల్లి

మరిన్ని వార్తలు