చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో..

3 Apr, 2022 14:43 IST|Sakshi
ఉల్లిపాయ ముక్కను బయటకు తీస్తున్న డాక్టర్లు

ఉల్లిపాయ ముక్క మింగేసిన చిన్నారి..

హిందూపురం(అనంతపురం జిల్లా): 9 నెలలో చిన్నారి గొంతులో ఉల్లి ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసింది. తల్లిదండ్రులకు కొన్ని గంటలపాటు ప్రాణాలు నిలవకుండా చేసింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చాకచక్యంగా ఉల్లి ముక్కను తొలగించడంతో ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన వెంకటేష్‌ కుమారుడు (9 నెలల చిన్నారి) శనివారం ఆడుకుంటూ ఉల్లిపాయ ముక్కను మింగేశాడు.

చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

అది గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడంతో పిల్లాడు ఆపస్మారకస్థితిలో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన పట్టణానికి చేరుకుని పలు ప్రయివేట్‌ ఆసుపత్రులకు వెళ్లినా చేరి్పంచుకోలేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో డాక్టర్లు అమరేష్‌, వెంకట రమణనాయక్, వాహిద్‌ పిల్లాడికి చికిత్స నిర్వహించారు. ఉల్లి ముక్కను బయటకు తీశారు. తమ బిడ్డకు ఏమౌతుందోనని అప్పటివరకూ తల్లడిల్లిన హృదయాలు దీంతో ఉపశమన పొందాయి. తమ ఇంట ఉగాది సంతోషం నింపారంటూ  డాక్టర్లు, వైద్యసిబ్బంది రాజు, నిర్మలమ్మ, సత్తి, తదితరులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు