బతుకు చిన్నది.. వ్యాధి పెద్దది 

27 Jul, 2020 08:01 IST|Sakshi
క్యాన్సర్‌ బాధితుడు ఉదయ్‌కిరణ్‌

కుమారుడికి వైద్యం చేయించలేక తల్లిదండ్రులు అవస్థలు 

దాతల సాయం కోసం ఎదురుచూపు

భామిని: రోజువారీ కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడికి క్యాన్సర్‌ మహమ్మారి ప్రబలిందని తెలియడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. మండలంలోని ఘనసర కాలనీకి చెందిన గిరిజన దంపతులు పాలపర్తి రమేష్, భారతీల కుమారుడు ఉదయ్‌కిరణ్‌ (రెండో సంతానం) ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఎనిమిదేళ్ల బాలుడికి క్యాన్సర్‌ ప్రబలందని ఈ వ్యాధి ప్రాథమిక దశలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. విశాఖ కేజీహెచ్‌కు తీసుకొని వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడింది. ఐటీడీఏ పీఓ రూ.5 వేలు ఆర్థిక సాయం చేయడంతో విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించారు. బియ్యం కార్డులో బాలుడి పేరు లేకవడంతో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆదుకోలేక పోతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి దాతలు సాయం చేసి, తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. దాతలు బ్యాంక్‌ ఖాతాకు నగదు  పంపించాలని కోరుతున్నారు. 

బాధితుడు తండ్రి ఉదయ్‌కిరణ్‌ 
ఖాతా వివరాలు..
అకౌంట్‌ నంబర్‌: 35894805225,
ఎస్‌బీఐ కొత్తూరు శాఖ,
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0006636,
ఫోన్‌  నంబర్‌: 9346692680.    

మరిన్ని వార్తలు