పరిటాల సునీత ఫ్యామిలీ భూ బాగోతం!

24 Sep, 2020 10:58 IST|Sakshi

సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యుల భూ బాగోతం బయటపడింది. ఒక వ్యక్తి తీసుకున్న రూ. కోటి అప్పుకు అతడి నుంచి రూ.10 కోట్ల విలువైన భూమిని స్వాహా చేశారు. వివరాల్లోకి వెళితే... పరిటాల సునీత సోదరుడు మురళీ వద్ద వ్యాపారి మేడా చంద్రశేఖర్ కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ సందర్భంగా మురళీ తన మామ వేలూరు రామాంజపేయులు పేరుతో అగ్రిమెంట్‌ను రిజిస్టర్‌ చేయించాడు.

ఈ నేపథ్యంలో కురుగుంట వద్ద చంద్రశేఖర్‌ పేరు మీద ఉన్న రూ.10 కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై మురళీ కన్నేశాడు. అయితే తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానని చంద్రశేఖర్‌ చెప్పినా.. మురళీ అతని నుంచి బలవంతంగా విలువైన వ్యవసాయ భూమిని అప్పు కింద జమ చేసుకున్నాడు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా 2.75 రూపాయల వడ్డీతో అప్పు వసూలు చేసినట్లు తేలింది. తనను బెదిరించి భూమిని అక్రమంగా రిజిస్టర్‌ చేయించుకున్నారని బాధితుడు చంద్రశేఖర్‌ ఆరోపించాడు. ప్రస్తుతం పరిటాల సునీత కుటుంబం ల్యాండ్‌ డీల్‌ జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు