‘సచివాలయ’ ఉద్యోగాలు భర్తీ

10 Mar, 2021 04:51 IST|Sakshi

ఖాళీగా 8,402 పోస్టులు 

మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లపై మంగళవారం సచివాలయంలో వేర్వేరుగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఇటీవల సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు 

బాబూ.. నువ్వెప్పుడైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లావా? 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నందునే రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని సీఎం జగన్‌ నిర్ణయించారని పెద్దిరెడ్డి చెప్పారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖిలపక్ష బృందంలో చంద్రబాబును, టీడీపీకి చెందిన కార్మీకసంఘాల ప్రతినిధులను తీసుకుపోతామని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలపై ఏరోజైనా అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. ఉక్కు కర్మాగారం కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన స్టీల్‌ ఫ్యాక్టరీ వస్తుందా? అని అన్నారు.   

మరిన్ని వార్తలు