ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ  

26 Oct, 2021 05:05 IST|Sakshi
ఆర్టీíసీ ఉద్యోగుల పిల్లలకు కెరీర్‌ గైడెన్స్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (సీహెచ్‌ఎస్‌ఎస్‌) సౌజన్యంతో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన ఉచిత ఇంటెర్న్‌షిప్‌ కార్యక్రమం ముగింపు వేడుకను విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల కెరీర్‌ గైడెన్స్‌ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ శిక్షణకు 700 మంది హాజరయ్యారన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు