కారు డోర్‌ తెరిస్తే మ్మే..మ్మే... మేటరేమిటంటే!

30 Mar, 2021 09:05 IST|Sakshi

పోలీసులు ఒక కారును ఆపి డోర్‌ తెరిచారు అంతే..! మ్మే..మ్మే..అని రక్షించండో అన్నట్లు అరుస్తున్న మేకలను చూసి విస్తుపోయారు. కాళ్లు కట్టేసి, కొన్నిటికి మూతికి అడ్డంగా గుడ్డ కట్టేసి ఉన్న వాటిని బంధ విముక్తం చేశారు. ఇదేదో మేకల కిడ్నాప్‌లా ఉన్నట్లుందే అనుకుంటున్నారా?!..అయితే ఎస్‌ఐ రాజశేఖర్‌ సోమవారం చెప్పిన ఆ మ్మే..మ్మే..మేటరేమిటంటే..

ఆదివారం చిత్తూరు–అరగొండ రోడ్డులోని హైవే బ్రిడ్జి దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఒక స్విఫ్ట్‌ జైర్‌ కారులో 12 మేకలు పైవిధంగా ఉండటం చూసి అనుమానించారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వీళ్లు తిరుపతి శెట్టిపల్లెకు చెందిన టి.గిరి(34), పుల్లిచెర్ల మండలం ముతుకువారిపల్లెకు చెందిన భూపతి అలియాస్‌ కట్టప్ప(35), బంగారుపాళెం మండలం డీకే వూరుకు చెందిన కె.జ్యోతినాథ్‌(26), ఇందిరమ్మకాలనీకి చెందిన కె.భరత్‌(23) అని, వీరంతా మేకల దొంగలని, దొంగలించిన మూగజీవాలను విక్రయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది.

ఈ నెల 16న మండలంలోని మడవనేరిలో శివాజి, అజయ్‌కు చెందిన ఐదు మేకలు, ఈచనేరిలో కృష్ణయ్య చెందిన ఒక పొట్టేలు, ఒక గొర్రెను చోరీ చేసింది వీళ్లేనని వెల్లడైంది. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో నిందితుల ఇళ్ల నుంచి మరో 4 మేకలు, 4 పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్లు తవ
– తవణంపల్లె  

చదవండి: వింత: కోడి ఆకారంలో మేక..


 
నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

మరిన్ని వార్తలు