పులస @ రూ.21 వేలు

21 Sep, 2020 06:56 IST|Sakshi
పులసను దక్కించుకున్న ఏఎంసీ చైర్మన్‌ కొండలరావు

సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా