అరుదైన ‘నక్కతోక’ మొక్కను ఎప్పుడైనా చూశారా..?

18 Jan, 2022 13:25 IST|Sakshi

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): అరుదైన నక్కతోక (ఫాక్స్‌టెయిల్‌) ఆర్కిడ్‌ మొక్క స్థానిక రాణిచంద్రమణీదేవి ఆస్పత్రి ఆవరణలోని జీవవైవిధ్యపార్కులో కనువిందు చేస్తోంది. ఇవి గాలి నుంచే ఆహారం, తేమను తీసుకుని జీవిస్తాయి. ఈ తరహా మొక్కలు తూర్పు కనుమలలో మాత్రమే కనిపిస్తాయి. వీటిని అలంకరణ కోసం వినియోగిస్తారని డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రామమూర్తి తెలిపారు. ఈ పార్కుకు వచ్చే విద్యార్థులు ఈ తరహా మొక్కలపై పలురకాల పరిశోధనలు చేస్తుంటారు.
చదవండి: భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని.. భార్య ఎంత పనిచేసిందంటే..

మరిన్ని వార్తలు