విశాఖ కేంద్రంగా రిమోట్‌ రేడియాలజీ సేవలు 

20 Oct, 2022 07:34 IST|Sakshi

మెడ్‌టెక్‌ జోన్‌లో ‘టెలీ రేడియాలజీ సొల్యూషన్స్‌’ కొత్త కేంద్రం ప్రారంభం 

దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు ‘టెలీ రేడియాలజీ సొల్యూషన్స్‌(టీఆర్‌ఎస్‌).. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో నూతన కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలోని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టెలీ రేడియాలజీ సొల్యూషన్స్‌ సీఈవో, చీఫ్‌ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ అర్జున్‌ కల్యాణ్‌పూర్‌ మాట్లాడుతూ దేశంలో 70 శాతం గ్రామీణ, ఇతర ప్రాంతాల ప్రజలు రేడియాలజీ సేవల కోసం మెట్రో, పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన నూతన కేంద్రం ద్వారా ఆలోటు తీరుతుందన్నారు.

యువ రేడియాలజిస్టులు, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజిస్టులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ఇతర సహాయక సిబ్బందికి ఉపాధి అవకాశాలను కూడా ఈ హబ్‌ సృష్టిస్తుందన్నారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ అండ్‌ సీఈవో డాక్టర్‌ జితేంద్రశర్మ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య పరికరాల తయారీ పార్కుగా ఉన్న ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌.. రేడియాలజిస్టులు అందుబాటులో లేని ప్రదేశాల్లో టీఆర్‌ఎస్‌ సహకారంతో సీటీ స్కానర్, ఎంఆర్‌ఐ వంటి స్థానిక మెడ్‌టెక్‌ ఉత్పత్తుల వృద్ధికి దోహదపడుతుందని వివరించారు.  

మరిన్ని వార్తలు