ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ 

1 Nov, 2023 04:27 IST|Sakshi

నవంబర్‌ 30 వరకు అవకాశం 

ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 15 వరకు చాన్స్‌

సాక్షి, అమరావతి:  ఈ విద్యా సంవత్సరం (2023–24) ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియెట్‌ విద్యా మండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే మార్చిలో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు తమ తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ మంగళవారం తెలిపారు.

రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్‌ 30వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు.  

  మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకటి, రెండో ఏడాది ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. 
  ఇంటర్మీడియెట్‌ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1,100, ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. 
ఇప్పటికే ఇంటర్మీడియెట్‌ పాసై ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1,240, సైన్స్‌ విద్యార్థులు రూ.1,440 చెల్లించాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు