కోళ్లు మరణిస్తే సమాచారం ఇవ్వాలి

18 Jan, 2021 04:33 IST|Sakshi

మంత్రి సీదిరి అప్పలరాజు

సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల మరణాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కోళ్లలో మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి పక్షి నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. పుకార్లను నమ్మొద్దని, కోడి గుడ్లు, కోడి మాంసంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపారు. 

మరిన్ని వార్తలు