మొబైల్‌ వాడొద్దంటే.. ఒడిశా నుంచి ఆంధ్రాకు పారిపోయి..

26 Jun, 2022 15:01 IST|Sakshi

సాక్షి,మందస(శ్రీకాకుళం): మొబైల్‌ వాడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలుడు ఒడిశా నుంచి ఆంధ్రాకు సైకిల్‌పై పారిపోయి వచ్చేశాడు. ఆ బాలుడు మందస మండలంలోని మఖరజోల గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మందస పోలీసులు గుర్తించారు. మందస ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ ఆధ్వర్వంలో బాలుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వివరా లిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో బరంపురానికి చెందిన ఆశి ష్‌కుమార్‌ ఆచార్య 9వ తరగతి చదువుతున్నాడు.

తరచూ మొబైల్‌ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆశిష్‌ ఇంటి నుంచి పారిపోయి మందస చేరుకున్నాడు. మఖరజోల ప్రాంతంలో పోలీసులు గుర్తించి ఆరా తీసి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో వివరాలు చెప్పాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు ఆనంద్‌కుమార్, కమలకాంత్‌మిశ్రో హుటాహుటిన మందస చేరుకున్నారు. ఆశిష్‌ను శనివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌తో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఛైల్డ్‌లైన్‌ సిబ్బంది సునీత, మహిళా పోలీసు హారతి కూడా ఉన్నారు.

చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్‌ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...

మరిన్ని వార్తలు