ప్రాథమిక విచారణ లేని ఎఫ్‌ఐఆర్‌ వల్ల ఉద్యోగులపై మచ్చ పడుతుంది

2 Sep, 2021 04:56 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు దంపతులపై కేసులో సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాథమిక విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వల్ల సమాజంలో వారిపై మచ్చ ఏర్పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ హిమకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ కేసులో ప్రాథమిక విచారణ అవసరం లేదని దర్యాప్తు సంస్థ ఎందుకు భావిస్తోందో రిజాయిండర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలు వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరపలేదని, ఆధారాలు చూపకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిందని మంత్రి ఆదిమూలం సురేష్‌ దంపతుల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌దవే ధర్మాసనానికి తెలిపారు. 

మరిన్ని వార్తలు