సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన!

11 Nov, 2023 11:23 IST|Sakshi

దేశరాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ పేరిట దివ్యాంగుల ఒక స్టోర్‌ ఏర్పాటు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డివై చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులతో కలిసి దీనిని ప్రారంభించారు. నూతనంగా నిర్మితమైన ఈ కేఫ్ దివ్యాంగుల పర్యవేక్షణలో నడవనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వికలాంగులు తమ ప్రతిభ చూపారు. సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చేవారు కేఫ్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. 
 

ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన సంస్థ ద్వారా ఈ ‘మిట్టి కేఫ్’  నిర్వహణ కొనసాగనుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు విమానాశ్రయంతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల కార్యాలయాలలో ఇప్పటికే 35 కేఫ్‌లు నడుస్తున్నాయి. ఈ సంస్థ 2017లో ప్రారంభమయ్యింది. దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంటుంది. ఈ కేఫ్‌లో పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తారు. 
ఇది కూడా చదవండి: అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
 

మరిన్ని వార్తలు