కుప్పంలో టీడీపీ గూండాగిరి

26 Apr, 2023 04:55 IST|Sakshi

అర్బన్‌ సీఐ, ఎస్‌ఐలను కిందపడేసి.. వారిపై పడిన వైనం  

సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యం  

60 మందిపై కేసులు 

సాక్షి, చిత్తూరు/కుప్పం:  ప్రశాంతమైన కుప్పంలో టీడీపీ నేతలు గూండాగిరి ప్రదర్శించారు. పోలీస్‌ అధికారులపైనే దాడులకు తెగబడ్డారు. అర్బన్‌ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ శివకుమార్‌ కిందపడేలా తోసేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మంగళవారం తెలుగు తమ్ముళ్లు సుమారు 150 మందికిపైగా గుమికూడారు. టీడీపీ కుప్పం ఇన్‌చార్జ్‌ పి.ఎస్‌.మునిరత్నం, ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ నేతృత్వంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ , మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్, యూత్‌ ప్రెసిడెంట్‌ మణి, నాయకులు త్రిలోక్, గోపీనాథ్‌ కార్యకర్తలతో కలిసి పోలీసుల అనుమతి తీసుకోకుండానే టీడీపీ జెండాలతో రోడ్డుపైకి ప్రదర్శనగా వచ్చారు.

సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసు అధికారులపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ వారు బలంగా నెట్టేయడంతో అర్బన్‌ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ శివకుమార్‌ కింద పడిపోయారు. వారిపైన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున పడ్డారు. పోలీసులు సీఐ, ఎస్‌ఐలను పైకి లేపడంతో వారు తేరుకున్నారు. టీడీపీ నేతలు అరుపులు కేకలతో నినాదాలు చేస్తూ మరింతగా రెచ్చిపోతూ.. దిష్టిబొ మ్మ దహనానికి ప్రయత్నించారు.

పోలీసులు ఆ దిష్టిబొ మ్మను స్వాదీనం చేసుకుని దూరంగా పడేశారు. టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి ఆ దిష్టిబొ మ్మను తగులబెట్టి సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలకు సంబంధించి 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు తెగబడిన మరింతమందిని గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు.  

మరిన్ని వార్తలు