Dec 9th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

9 Dec, 2023 21:12 IST|Sakshi

నిన్న సుప్రీంకోర్టులో మరోసారి బయటపడ్డ బాబు తొండి వాదన

బాబుకు సంబంధించి ఏ కేసునయినా 17aకు  ముడిపెట్టే ప్రయత్నం

తప్పు చేయలేదని కోర్టుకు ఇప్పటివరకు ఎక్కడా చెప్పని చంద్రబాబు

తనను అరెస్ట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతి తీసుకోలేదంటూ పిటిషన్లు

అవినీతి పాల్పడే వారికి చట్టం ఏ రకంగా అండగా నిలుస్తుంది?

కోర్టులో ఒకలా, ప్రజల మధ్యలో మరోలా చంద్రబాబు వాదనలు

Chandrababu Cases, Political Updates

09:01PM, Dec 09, 2023

ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు 

 • చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ
 • చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? 
 • ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా?
 • ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా?
 • అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది?
 • చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? 
 • పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా?

03:24PM, Dec 09, 2023

ప్రశ్నిస్తా అనే పవన్‌కు వైఎస్సార్‌సీపీ ప్రశ్న

 • టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్‌సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్‌ కళ్యాణ్‌ సూత్రీకరించాడు
 • ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను  ఆదేశిస్తున్నారు.
 • ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!!
 • టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?!
 • పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది
 • అదే మాట జనసైనికులను పవన్‌ అనవచ్చన్న మాట..!
 • ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..?
 • అసలు అబ్రహం లింకన్‌తో పవన్‌ పోల్చుకోవడం ఏంటీ..?
 • అబ్రహం లింకన్‌ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు
 • అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు
 • అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
 • మరీ.. పవన్‌ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు
 • పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు
 • రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు
 • చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్‌ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్‌ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు

12:22 PM, Dec 09, 2023
స్కిల్‌ కేసు ఎక్కడికి దారి తీస్తుంది?

 • స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా
 • 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్‌ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే
 • ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే
 • అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది?
 • నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు?
 • అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్‌ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.?

 • అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూ­డదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది సుప్రీంకోర్టు

సెక్షన్‌ 17 ఏ విషయమేంటీ?

 • అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని ఉన్నదే సెక్షన్‌ 17ఏ
 • 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ
 • సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్‌ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం
   

చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ?

 • చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్‌ కుంభకోణం
 • 2015-16లో స్కిల్‌ కుంభకోణం జరిగింది
 • జూన్‌ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్‌ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు
 • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి
 • సెక్షన్‌ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్‌ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది
 • ఆంధ్రప్రదేశ్‌ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి
 • అప్పటి చంద్రబాబు ప్రభు­­త్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది.
 • 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది

గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి?

అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్‌ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’
– పట్నా హైకోర్టు 

‘సెక్షన్‌ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ 
– డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది

 • కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్‌ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు
 • ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్‌ 17ఏ రక్షణ కల్పించదు
 • ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్‌ 17ఏ కింద రక్షణ లభించదు
 • సెక్షన్‌ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు
 • ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్‌ నుంచి బయ­ట­పడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు.
 • తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్‌ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు
 • ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా?
 • తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా?
 • తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు
 • స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు

12:05 PM, Dec 09, 2023
గుంటూరులో చంద్రబాబు పర్యటన

 • 2వ రోజు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన
 • బాపట్ల, పర్చూరు, ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన
 • పర్చూరు లో డ్రెయిన్‌ను పరిశీలిన
 • ప్రత్తిపాడు, పెదనంది పాడులో రైతులతో చంద్రబాబు ముఖాముఖి
 • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం దొరుకుతుందన్న ఆశతో చంద్రబాబు పర్యటనలు
 • అంతటా సానుకూలంగా కనిపిస్తుండడంతో మరింత శోధన
 • తుపాను ప్రభావాన్ని ప్రభుత్వ లోపంగా చూపించడానికి సర్వ ప్రయత్నాలు
 • ఆంధ్రప్రదేశ్‌కు తుపానులేమి కొత్తకాదు : YSRCP
 • చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకున్నదే లేదు, పంటనష్టాన్ని భరించింది లేదు
 • అసలు వ్యవసాయమే దండగ అన్నది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబే
 • ఇప్పుడు ఎన్నికల సమయంలో సానుభూతి కోసం తిరిగితే ఎవరు నమ్ముతారు?

11:45 AM, Dec 09, 2023
చంద్రబాబు ట్రైనింగ్‌ అంటే ఏమనుకున్నారు.?

 • చంద్రబాబు బాటలోనే తెలుగుదేశం నాయకులు
 • మహిళా ఉద్యోగినిపై నోరు పారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
 • ITDA PO ఉద్యోగిని మందా రాణిపై నోరుపారేసుకున్న సోమిరెడ్డి
 • ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
 • బెదిరింపుల వ్యవహారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఐటిడిఏ పీవో

11:00 AM, Dec 09, 2023
పచ్చ బ్యాచ్‌కు వైఎస్సార్‌సీపీ కౌంటర్‌..

 • చంద్రబాబుకు 2019లోనే ప్రజలు బుద్ది చెప్పారు. 
 • వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉనికి కూడా ఉండదు. 
 • బాబు.. రాష్ట్రానికి, రాజకీయాలకు చేసిన హామీ అంతా ఇంతా కాదు.  
   

7:15 AM, Dec 09, 2023
కోర్టు షరతులు ఉల్లంఘించిన చంద్రబాబు

 • బెయిల్‌ షరతులు ఉల్లంఘించి మరీ చంద్రబాబు ఉపన్యాసం
 • తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తన కేసు గురించి ప్రస్తావన
 • స్కిల్‌ స్కాం గురించి మాట్లాడకూడదని చెప్పిన హైకోర్టు, సుప్రీంకోర్టు
 • కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రసంగం
 • తప్పు చేయకుండా తనను జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యలు
 • బెయిల్‌ షరతులు చంద్రబాబు ఉల్లంఘించినందున బెయిల్‌ రద్దును కోరవచ్చంటున్న న్యాయ నిపుణులు.

7:05 AM, Dec 09, 2023
50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు
పవన్‌ కళ్యాణ్‌కు తెగేసి చెబుతోన్న కాపులు

 • ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి?
 • అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి?
 • 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.!
 • 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.!
 • అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.?
 • తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.!
 • ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.?
 • అసలు కాపులెందుకు రాజీ పడాలి?

అసలు కాపులు సీఎం జగన్‌ను ఎందుకు వ్యతిరేకించాలి?

 • సీఎం జగన్‌ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు
 • నాన్‌ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది
 • రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా..

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు

 • హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు
 • కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు
 • మరి జగన్‌ ప్రభుత్వంలో ఏం జరిగింది?
 • బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్‌నాథ్‌ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి

అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్‌లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది

 • హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు
 • కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు
 • ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు

అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి

 • ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.?
 • నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు
 • అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్‌ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా?
 • చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్‌ వాటిని ఎత్తేయించాడు
 • చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్‌లో ఫంక్షన్‌ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు

కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.?

 • చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు?
 • లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు
 • సంకర జాతి, బ్రీడ్‌.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు
 • మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు
 • అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా?
 • ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా?
 • పవన్‌ చెప్పాడని గుడ్డిగా జగన్‌ మీద కక్ష పెంచుకోగలమా?
 • దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా
 • అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు
 • లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు
 • నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు

(ఫైల్‌ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్‌ కళ్యాణ్‌)

7:00 AM, Dec 09, 2023
ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ

 • విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు
 • పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్
 • హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్
 • అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు
 • వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు
 • ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి
 • ఒక  వ్యక్తికి ఎక్కువ  చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం
 • ఫామ్‌ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి
 • కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి
 • వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి
 • తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి
 • తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష

6:50 AM, Dec 09, 2023
ఓటర్లతో చంద్రబాబు రాజకీయం

 • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు
 • ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు
 • క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి
 • ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు
 • ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి
 • ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు
 • మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు.

మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు?

 • గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటర్‌ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది?
 • తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది?
 • మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది?
 • ఆధార్‌ కార్డును ఓటర్‌ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది?
 • ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు?
 • అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు?
 • పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు?

కేసు ఎందుకు వాయిదా పడిందంటే.?

 • స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా
 • 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే
 • కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి
 • 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే
 • నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
 • విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం
 • సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం
>
మరిన్ని వార్తలు