సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లకు టీటీడీ ఆహ్వానం

4 Oct, 2021 04:45 IST|Sakshi

తిరుమల: టీటీడీ నిర్వహించనున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌ ఆస్పత్రిలో స్వచ్ఛంద సేవలు అందించడానికి దేశంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పీడియాట్రిక్‌ కార్డియో థోరాసిక్‌ సర్జన్లు, వైద్యులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ ప్రాణదాన పథకం కింద నిర్వహించనున్న ఈ ఆస్పత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె చికిత్స, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 ఏళ్ల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన వైద్యులు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఆసక్తి గల వైద్యనిపుణులు  cmo. adldirector@gmail. com  మెయిల్‌ ఐడీకి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి అర్హత పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది. 

ఆప్షన్‌ అ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, ప్రోటోకాల్‌ దర్శనం, తిరుమల–తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు.

ఆప్షన్‌ ఆ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తారు. వీరికి శ్రీవారి దర్శనం, రవాణా సదుపాయాలు ఉండవు.  

మరిన్ని వార్తలు